HHVM : హరి హర వీరమల్లు’ కి త్రివిక్రమ్ ఫినిషింగ్ టచ్‌ ?


చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హరిహర వీర మల్లు చివరికి పూర్తి స్థాయిలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆదివారం రాత్రి నుండి ప్రారంభమైన షెడ్యూల్‌ ద్వారా ఈ రోజు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరి దశ షూటింగ్‌లో పాల్గొన్నారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న తర్వాత, ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి సినిమా ముగించేశారు. చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పిస్తుండగా, దయాకర రావు నిర్మిస్తున్నారు.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

ఇందులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఈ చిత్రానికి ఫైనల్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌లో అతనికి ఎలాంటి సంబంధం లేకపోయినా, పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు త్రివిక్రమ్ ఈ బాధ్యతను స్వీకరించినట్లు సమాచారం. కథా నేపథ్యం 17వ శతాబ్దానికి చెందిన ఈ చిత్రం, పవర్ ఫుల్ హీరోయిజంతో పాటు భారీ నిర్మాణ విలువలతో రూపొందుతోంది. పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ట్రైలర్ ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం త్వరలో విడుదలై తెలుగు ప్రేక్షకులకు భారీ విజువల్ ట్రీట్ అందించనున్నది.