
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం ‘దండోరా’తో సింగర్ అదితి భావరాజు వెండితెరకు నటిగా పరిచయం అవుతున్నారు. ‘కలర్ ఫోటో’ వంటి వినూత్న సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని, అనంతరం ‘బెదురులంక 2012’ వంటి హిట్ సినిమాను నిర్మించారు. ఇప్పుడు మురళీకాంత్ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’ తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రేమకథతో పాటు సమాజంలో కొనసాగుతున్న దుష్ప్రవర్తనలు, అసమానతలు వంటి అంశాల్ని చిత్రం హృదయానికి హత్తుకునేలా చూపించనుంది.
ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సింగర్‌గా ఇప్పటికే ఎన్నో చార్ట్‌బస్టర్ పాటలతో గుర్తింపు పొందిన అదితి భావరాజు, ఈ సినిమాతో నటిగా కొత్త అవతారమెత్తనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇటీవల విడుదలైన ‘ఫస్ట్ బీట్’ టీజర్‌కు మంచి స్పందన లభించింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా మార్క్ కె. రాబిన్, సినిమాటోగ్రఫీకి వెంకట్ ఆర్. శాఖమూరి, ఎడిటింగ్‌కు సృజన అడుసుమిల్లి పని చేస్తున్నారు. బియాండ్ మీడియా పీఆర్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, టికెట్ ఫ్యాక్టరీ మార్కెటింగ్ బాధ్యతలు చేపట్టింది. ‘దండోరా’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.









