Mahavatar Narsimha Trailer : మహావతార్ యూనివర్స్‌కి శుభారంభం – నరసింహ గర్జన మొదలైంది!


Mahavatar Narsimha Trailer : హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో, క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న “మహావతార్ నరసింహ” ట్రైలర్ విడుదలైంది. హిరణ్యకశిపుడు చేసిన తపస్సు నుంచి మొదలయ్యే ఈ ట్రైలర్, ప్రహ్లాదుడి భక్తి, నరసింహుడి అవతారం వరకూ ఊపిరి పీల్చకుండా కట్టిపడేసే విజువల్స్‌తో సాగింది. డివైన్ థీమ్‌కు గూస్‌బంప్స్ తెప్పించే నేపథ్య సంగీతం, గ్రాఫిక్స్, యానిమేషన్‌తో ఈ ట్రైలర్ అద్భుతంగా ఉండి ప్రేక్షకుల ఆసక్తిని మరింతగా పెంచింది.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందిస్తున్న ఈ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, 3Dలో ఐదు భాషల్లో 2025 జూలై 25న థియేటర్లలో విడుదల కానుంది. నిర్మాతలు శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మహావతార్ ఫ్రాంచైజీలో ఇది తొలి చిత్రం కాగా, తదుపరి ఎపిసోడ్లుగా మహావతార్ పరశురామ్ (2027) నుంచి మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) వరకూ ఫేజ్ వైజ్ రిలీజ్ చేయనున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ఆధునిక యానిమేటెడ్ సాంకేతికతతో తెరపైకి తీసుకొచ్చే ఈ ప్రాజెక్ట్ దేశవిదేశాల్లోనూ ఆసక్తిని రేపుతోంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్