![]()
Avatar 3 : 2009లో విడుదలై ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన జేమ్స్ కెమెరూన్ చిత్రం ‘అవతార్’ ఇప్పటికీ ప్రపంచ సినీ చరిత్రలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ చిత్ర విజయం తరువాత 13 ఏళ్ల విరామంతో వచ్చిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ వసూళ్ల పరంగా హిట్ అయినప్పటికీ, కథ పరంగా మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకుంది. ఆ సిరీస్‌లో మూడవ భాగమైన ‘అవతార్: ది ఫైర్ అండ్ యాష్’ ఈ ఏడాది డిసెంబర్ 19న విడుదల కానుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను జూలై 25న రిలీజ్ కాబోతున్న హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘ది ఫెంటాస్టిక్ ఫోర్ : ఫస్ట్ స్టెప్స్’ సినిమాతో పాటు రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించారు మేకర్స్.
ఈ సీరిస్‌లో ఇప్పటి వరకు నేల (పాండోరా), నీరు (వే ఆఫ్ వాటర్) తరువాత ఈసారి నిప్పు (ఫైర్ అండ్ యాష్) ఆధారంగా సినిమా సాగనుంది. ట్రైలర్ ను సినిమా విడుదలకు ఐదు నెలల ముందే లాంచ్ చేయడం సినిమా పైనున్న నమ్మకాన్ని చెబుతుంది. ఇకపోతే ఇండియాలో కూడా కెమెరూన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో, డిసెంబర్ 15 తర్వాత రిలీజ్ ప్లాన్‌చేసుకున్న భారతీయ చిత్రాలు తేదీలు మార్చుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. అవతార్ 4 2029లో, అవతార్ 5 2031లో రాబోతాయని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.









