
My Baby : తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘డీఎన్‌ఏ’ మూవీ తెలుగులో ‘మై బేబీ’ అనే టైటిల్‌తో జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అధర్వ, నిమిషా సాజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించారు. సురేష్ కొండేటి, సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి నిర్మాణ భాగస్వాములుగా ఉన్న ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే రూ.35 లక్షల వసూళ్లను రాబట్టి, చిన్న సినిమాల విభాగంలో పెద్ద విజయాన్ని సాధించింది. కథ, భావోద్వేగాలు, కుటుంబ విలువలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
ఎస్కే పిక్చర్స్ కొన్ని సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఈ సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తమ బ్యానర్‌పై మంచి సినిమాలు తీసుకొస్తామని మళ్లీ నిరూపించుకున్నారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కథలను ఆదరిస్తారు. ఈ విజయమే మాకు మళ్లీ ధైర్యం, నమ్మకం ఇచ్చింది అని నిర్మాత సురేష్ కొండేటి వెల్లడించారు. ప్రేక్షకుల ఆదరణకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.










