War 2 : ‘వార్ 2’ ఫస్ట్ సాంగ్‌కి మళ్లీ అదే టీం.. ‘కేసరియా’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

War2
War 2 : ‘బ్రహ్మాస్త్ర’ తో విజయం అందుకున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పుడు ‘వార్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ సంచలనం రేపిన ఈ సినిమాలోని మొదటి పాటపై ఇప్పుడు ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

హృతిక్ – కియారా మధ్య తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ డ్యూయెట్‌ కోసం ‘బ్రహ్మాస్త్ర’లోని కేసరియా పాటతో దేశాన్ని ఊపేసిన మ్యూజిక్ టీంను మళ్లీ రంగంలోకి దింపారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్, సింగర్ అరిజిత్ సింగ్, లిరిసిస్ట్ అమితాబ్ భట్టాచార్య ఈ పాట కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ప్రేమ, ఎమోషన్, మ్యాజిక్‌తో నిండేలా ఈ ట్రాక్‌ను రూపొందిస్తున్నారని సమాచారం. ఇక ఈ రొమాంటిక్ డ్యూయెట్‌ కూడా ‘కేసరియా’ లాగే మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి మరి. త్వరలోనే ఈ పాటను రిలీజ్ చేసి, సినిమా ప్రమోషన్‌ను మళ్ళీ టాప్ గేర్‌లోకి తీసుకెళ్లాలనే ప్లాన్‌లో చిత్రయూనిట్ ఉంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ ఆగస్ట్ 14న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.