Sir Madam : పరాటా కోసం కోర్సు చేసిన హీరో..?

Sirmadam
Sir Madam : వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, ట్యాలెంటెడ్ నిత్యా మీనన్ జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘సార్ మేడమ్’, “A Rugged Love Story” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైంది. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్రం పెద్ద హిట్ సాధించగా, ఇప్పుడు ఆగస్ట్ 1న తెలుగులో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

ఈ ఈవెంట్‌లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. నేనెప్పుడూ హైదరాబాద్ వచ్చిన తెలుగు ప్రజలు ఎంతగానో ప్రేమ అభిమానాన్ని చూపిస్తారు. ఈ సినిమాకి తెలుగు పాటలు రాంబాబు గారు చాలా చక్కగా రాశారు. వినసొంపుగా వున్నాయి. ఈ సినిమా కోసం పరాటా చేయడం నేర్చుకున్నాను. అందుకోసం రెండు నెలల కోర్స్ కూడా చేసానని విజయ్ సేతుపతి చెప్పారు. ఈ సినిమా అంతా ఒక ఫ్యామిలీ ఎట్మాస్ఫియర్ లో జరిగింది. నిత్యతో వర్క్ చేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. డైరెక్టర్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. అందరూ థియేటర్స్ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...