Zootopia 2 : ‘జూటోపియా 2’ వచ్చేస్తోంది.. సిద్ధంగా ఉన్నారా?

Zootopia2
Zootopia 2 : వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జూటోపియా 2’ ట్రైలర్ మరియు పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. 2016లో వచ్చిన మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సూపర్‌హిట్ కావడంతో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ యానిమేటెడ్ సీక్వెల్ నవంబర్ 28 నుంచి భారతదేశంలోని థియేటర్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. మొదటి భాగంలో భారీ కేసును పరిష్కరించిన జూడీ హాప్స్ (గిన్నిఫర్ గుడ్‌విన్) మరియు నిక్ వైల్డ్ (జాసన్ బేట్‌మన్) ఇక పూర్తి స్థాయి పోలీస్ భాగస్వాములుగా పనిచేస్తున్నారు. అయితే వారి మధ్య ఉన్న బంధం ఊహించినంత బలంగా లేదు. ఈ నేపథ్యంలో చీఫ్ బోగో (ఇడ్రిస్ ఎల్బా) వారి ఇద్దరినీ కౌన్సెలింగ్‌కు పంపిస్తాడు. ఇదే సమయంలో, ఒక విషపూరిత పాము జూటోపియాలో సంచలనం రేపుతుంది. ఆ పాము రాక వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు ఇద్దరూ మరోసారి కలిసి వస్తారు.

Also Read :  GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పూజా కార్యక్రమాలతో “R” చిత్ర ప్రారంభం

ఈ సీక్వెల్‌లో కొత్త పాత్రలుగా గ్యారీ డిస్నేక్ (కీ హుయ్ క్వాన్), నిబుల్స్ (ఫార్చ్యూన్ ఫీమ్‌స్టర్), డాక్టర్ ఫజ్‌బై (క్వింటా బ్రన్సన్) పరిచయమవుతున్నారు. ఆస్కార్ విజేతలైన జారెడ్ బుష్ మరియు బైరన్ హోవార్డ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యవెట్ మెరినో నిర్మాణంలో వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్(Walt Disney Animation Studios) రూపొందించిన 64వ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా నిలవనుంది. హ్యూమర్, ఎమోషన్, మిస్టరీతో కూడిన ఈ అడ్వెంచర్‌ను అభిమానులు థియేటర్లలో మిస్ కాకుండా చూడాల్సిందే.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...