PuriSethupathi : పూరి-సేతుపతి టైటిల్, టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Purisethupathi
PuriSethupathi : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారి కలిసి చేస్తున్న చిత్రం #పూరిసేతుపతి పాన్-ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ మెగా అప్డేట్ ఇచ్చారు.

డైరెక్టర్ పూరి జగన్నాధ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 28న ఈ సినిమాకి టైటిల్ & టీజర్ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చెన్నై లోని గ్రీన్ పార్క్ హోటల్లో రేపు మధ్యాహ్నం టైటిల్ & టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త హీరోయిన్‌గా నటించగా, టబు, విజయ్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.