Chiranjeevi : ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెట్‌లో తిలక్ వర్మకు చిరంజీవి సన్మానం!

Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్ లో ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మను చిరంజీవి స్వయంగా సన్మానించారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడి భారత్ విజయానికి తోడ్పడిన తిలక్ ప్రతిభను మెగాస్టార్ అభినందిస్తూ, ఆయనకు శాలువా కప్పి, మ్యాచ్‌లోని మెమొరబుల్ మూమెంట్‌ను ఫ్రేమ్ చేసి అందజేశారు. “కృషి, క్రమశిక్షణ కేవలం క్రీడలోనే కాదు, జీవితంలోనూ విజయానికి మార్గం చూపుతాయి” అని చిరంజీవి అన్నారు.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

Chiranjeevi1

ఈ కార్యక్రమంలో నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గరపాటి, సుస్మిత కొణిదెల పాల్గొని తిలక్ వర్మను అభినందించారు. ఇండియన్ సినిమా ఐకాన్ చిరంజీవి చేత సన్మానం పొందడం తిలక్ వర్మకు ఒక గుర్తుండిపోయే అనుభవంగా నిలిచింది. చిరంజీవి దయ, వినయం, మరియు ప్రేరణాత్మక వ్యక్తిత్వం మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.