‘జిగ్రీస్’ తో జోరందుకున్న కృష్ణ బూరుగుల…

Krishna burugula
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘క్రష్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కృష్ణ బూరుగుల, మొదటి చిత్రం నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తర్వాత దిల్ రాజు నిర్మించిన ‘ATM’ వెబ్ సిరీస్‌లో నటించి తన యాక్టింగ్ స్కిల్స్‌ను మరింతగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక కొరటాల శివ నిర్మించిన ‘కృష్ణమ్మ’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు సాధించాడు. తాజాగా, కృష్ణ హీరోగా నటించిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘జిగ్రీస్’ ఈ నెల 14న థియేటర్లలో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

సినిమా విడుదల తర్వాత కృష్ణ బూరుగుల నటనకు ఆడియెన్స్‌తో పాటు క్రిటిక్స్ నుంచీ కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘జిగ్రీస్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోతే తాను నటన మానేస్తానని, ‘DJ టిల్లు’, ‘జాతి రత్నాలు’ లా నవ్విస్తానని చేసిన సంచలన వ్యాఖ్యలను కృష్ణ నిలబెట్టుకున్నట్లు కనిపిస్తోంది. చిత్రంలో ‘చిచోర్’ పాత్రలో కృష్ణ మొత్తం కథను తన భుజాలపై మోసినట్టు చెప్పొచ్చు.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

తనదైన కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించిన కృష్ణ, ఎమోషనల్ సీన్స్‌లోనూ అదే స్థాయి నైపుణ్యం ప్రదర్శించాడు. ప్రత్యేకమైన స్లాంగ్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా బాగా కనెక్ట్ అవుతున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో కృష్ణ బూరుగుల టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.