Draupathi 2 : ‘ద్రౌపది 2’ నుంచి రక్షణ మెస్మరైజింగ్ లుక్ విడుదల

Draupathi2
Draupathi 2 : రిచర్డ్ రిషి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ద్రౌపది 2’. నేతాజీ ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోహన్ జి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని కీలక పాత్ర ద్రౌపది దేవిగా నటిస్తున్న రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ద్రౌపది దేవిగా రక్షణ ఎంతో గాంభీర్యంగా, హుందాగా కనిపిస్తున్నారు. ఆ కట్టుబొట్టు, ఆహార్యం, మొత్తం గెటప్ అందరిని మెస్మరైజ్ చేస్తుంది. పోస్టర్‌లో కనిపించిన భారీ సెట్ వర్క్ సినిమా స్కేల్ ఎంత వైభవంగా ఉంటుందో స్పష్టంగా తెలియజేస్తోంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. త్వరలోనే మిగిలిన కార్యక్రమాలు పూర్తిచేసి రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ, దేవరాజ్ ఎస్ ఎడిటింగ్, ఎస్.కే ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను యాక్షన్ సంతోష్ భారీ స్థాయిలో కంపోజ్ చేస్తుండగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.