
Dulquer Salmaan: టాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్. హీరో నాని ప్రెజెంటేషన్‌లో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ బ్యానర్ నుంచి తాజాగా రెండు భారీ క్రేజీ సినిమాలు ఓకే అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో ఈ బ్యానర్ ఒక వినూత్న చిత్రాన్ని నిర్మించబోతోందట.
లీగల్ డ్రామా ‘కోర్టు’ మూవీతో డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న జగదీష్ దుల్కర్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌లో రాబోతున్న ఈ విభిన్న కాంబినేషన్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే ఇండస్ట్రీలో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. దుల్కర్ సల్మాన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా కోసం జగదీష్ ఒక మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దుల్కర్ ఆకాశంలో ఒక తార, వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. వీటి తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుందా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
కేవలం దుల్కర్ సల్మాన్ ప్రాజెక్ట్‌తోనే ఆగకుండా, వాల్ పోస్టర్ సినిమాస్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా లైన్లో పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిన ‘దండోరా’ సినిమా డైరెక్టర్‌తో ఈ బ్యానర్ ఒక సినిమాను నిర్మించబోతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. వరుస సినిమాలతో వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.











