ఇక కేవలం పాటలే బాకీ.. దసరా బరిలోకి వెంకీ-త్రివిక్రమ్ ‘AK 47’!

Aadarsha Kutumbam

AK 47: విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నెం: 47 – #AK47). దసరా కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ అప్‌డేట్‌కు సంబంధించి ఒక క్రేజీ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఫిల్మ్‌నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు ముగింపునకు వచ్చేసిందట. ప్రస్తుతం సాంగ్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెబుతున్నారు. హీరో వెంకటేష్‌కు సంబంధించిన ప్యాచ్ వర్క్, టాకీ పార్ట్ రఫ్‌గా మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాలో కీలకమైన విలన్ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కేవలం ఒక వారంలో పూర్తి చేయనున్నారని టాక్.

Also Read :  The Paradise: సెప్టెంబర్ 25న థియేటర్స్‌లో నాని జడల్ హంగామా.. సరికొత్త వేటకు డేట్ లాక్!

షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం శరవేగంగా జరుగుతుండటంతో.. ‘ఆదర్శ కుటుంబం’ దసరా బరిలో నిలవడం వంద శాతం ఖాయమైపోయిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని అఫీషియల్ అప్‌డేట్స్, టీజర్, ప్రమోషన్స్ త్వరలోనే స్టార్ట్ కానున్నాయని సమాచారం.