
Thalaivar173: ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇద్దరు అగ్ర హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘#Thalaivar173’ అఫీషియల్ జర్నీ నేడు గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘ధర్మన్’ (#Dharman) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్రన్ ఈ క్రేజీ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్, గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా, ప్రముఖ కమెడియన్ యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం మాస్ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ రంగంలోకి దిగారు. కమల్ హాసన్‌కు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI), టర్మెరిక్ మీడియాతో కలిసి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్, ఏపీఐ ఫిల్మ్స్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ సౌత్ కైవసం చేసుకుంది. దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒకే ప్రాజెక్ట్‌లో భాగం అవుతుండటంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ధర్మన్’ జర్నీ ప్రారంభమైందంటూ వచ్చిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.
The journey is on #Dharman#Thalaivar173 #SuperstarRajinikanth #KamalHaasan @rajinikanth @ikamalhaasan #Mahendran @Dir_Ashwath @anirudhofficial @anbariv @iYogiBabu @SimranbaggaOffc #RaashiKhanna @nikethbommi #KarthikRajkumar @PradeepERagav @kabilanchelliah @ShruthiManjari… pic.twitter.com/mHFTJlWjBe
— Raaj Kamal Films International (@RKFI) June 24, 2026














