Idupu Kayitham: సుకుమార్ ఆశీస్సులతో ‘ఇడుపు కాయితం’ షురూ.. హీరోయిన్‌గా తెలుగమ్మాయి!

Idupu Kayitham

Idupu Kayitham: టాలీవుడ్‌లో మరో కొత్త చిత్రం గ్రాండ్‌గా పట్టాలెక్కింది. సరికొత్త స్టోరీ లైన్‌తో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham) సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ చిత్ర ముహూర్తపు వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఆయన సతీమణి తబితా సుకుమార్లతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, బన్నీ వాస్ ముఖ్య అతిథులుగా వచ్చారు. చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేసి, క్లాప్ కొట్టి సినిమాను అఫీషియల్‌గా స్టార్ట్ చేశారు.

Also Read :  Peddi OTT release: వచ్చే వారమే ఓటీటీలోకి ‘పెద్ది’.. రిలీజ్ డేట్ ఇదే

ఈ చిత్రాన్ని ‘సుకుమార్ రైటింగ్స్’, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తుండటంతో దీనిపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో హీరోగా ప్రియదర్శి, తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్‌గా నటించనుంది. ప్రామిసింగ్ మూవీస్ చేస్తున్న ప్రియదర్శి హీరో కావడం, ఏ ఫోక్ సాంగ్ చేసినా మిలియన్స్‌లో వ్యూస్ రాబట్టే క్రేజ్ ఉన్న నాగదుర్గ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీ ఏర్పడింది. ఈ సినిమాను యువ డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబో మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.