Comedy Film: సైలెంట్‌గా తెరకెక్కుతున్న క్రేజీ సినిమా!

Comedy Film

Comedy Film: కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు అదిరిపోయే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులను తన టైమింగ్‌తో నవ్వుల్లో ముంచెత్తే స్టార్ కమెడియన్ సత్య, తమిళ సినీ పరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యోగి బాబు తొలిసారి కలిసి ఓ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారనే వార్త ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కమెడియన్లుగా గుర్తింపు పొందిన సత్య, యోగి బాబు కలిసి వెండి తెరపై కనిపించనున్నారనే వార్తతోనే సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇద్దరి కామెడీ టైమింగ్‌కు ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మంచి వినోదాన్ని అందిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ, దర్శకుడు, నిర్మాణ సంస్థ, ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. షూటింగ్‌ను జాగ్రత్తగా పూర్తి చేసిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడించాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.