
KING100: కింగ్ నాగార్జున నటిస్తున్న ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. డీఎస్పీ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
గతంలో నాగార్జున – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మన్మధుడు’, ‘మాస్’, ‘కింగ్’ వంటి చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ప్రతి సినిమాలోనూ డీఎస్పీ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ మరోసారి ‘కింగ్ 100’ కోసం కలవడంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి డైరెక్టర్ రాకార్తిక్ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. నాగార్జున కెరీర్‌లో ఇది 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. దేవిశ్రీ ప్రసాద్ చేరికతో ‘కింగ్ 100’ మ్యూజికల్‌గా కూడా మరో స్థాయికి వెళ్లనుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.













