
NBK111: ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK111 పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని సన్నివేశాలకు బాలకృష్ణ శుక్రవారం నుంచి డబ్బింగ్ చెప్పనున్నట్లు సమాచారం అలాగే అక్టోబర్ 5 నుంచి మైసూరులో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. NBK111 ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ కథగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. గోపీచంద్ మలినేని తన మార్క్ మాస్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో బాలకృష్ణకు గాయం కావడంతో కొంతకాలం చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఆయన తిరిగి షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ఐ సినిమా టైటిల్‌పై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మేకర్స్ ‘GOD’, ‘DADA’ అనే రెండు పవర్ఫుల్ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. బాలయ్య ఇమేజ్, కథకు ‘GOD’ టైటిల్ బాగా సరిపోతుందని చిత్రబృందం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పేరునే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే టైటిల్‌తో పాటు ఇతర వివరాలపై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.














