
Ravi Teja: మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’ సక్సెస్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లు చెబుతున్నారు. వరుస పరాజయాల తర్వాత ఇరుముడి సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకున్న మాస్ మహారాజా.. ఇకపై కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. మంచి స్టోరీతో సినిమా చేస్తే ప్రేక్షకులు ఎప్పటికీ తన సినిమాలను ఆదరిస్తారనే నమ్మకం ‘ఇరుముడి’ ఘన విజయంతో రవితేజలో మరింత బలపడిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమైన రవితేజకు ‘ఇరుముడి’ భారీ ఊరటనిచ్చింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తనపై నమ్మకం ఉంచిన ప్రేక్షకులు.. మంచి కంటెంట్ అందిస్తే మరోసారి థియేటర్లకు వచ్చి ఆదరించారని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక నుంచి కేవలం కమర్షియల్ అంశాలకే పరిమితం కాకుండా.. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టే బలమైన కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్.
ఇక ఈ మార్పులో రవితేజ కుమార్తె మోక్షధ కూడా కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ‘ఇరుముడి’ స్టోరీ ముందుగా విన్న మోక్షధ.. ఈ సినిమా తప్పకుండా చేయాలని తన తండ్రికి సూచించినట్లు సమాచారం. ఆమె అభిప్రాయాన్ని నమ్మిన రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చివరకు ‘ఇరుముడి’ మంచి విజయాన్ని అందుకోవడంతో.. మోక్షధ జడ్జిమెంట్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇకపై తాను వినే కథల విషయంలో మోక్షధ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని రవితేజ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కథ నచ్చిందా? ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? అనే విషయాల్లో ఆమె అభిప్రాయాన్ని తెలుసుకునేలా తనను కథల జడ్జిమెంట్‌లో భాగం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ‘ఇరుముడి’ గ్రాండ్ సక్సెస్‌తో రవితేజ కెరీర్లోనే కాకుండా.. ఆయన కథల ఎంపిక విషయంలోనూ ఓ కీలక మార్పుకు కారణమైందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు తన తండ్రికి ‘ఇరుముడి’ చేయాలని సూచించి పరోక్షంగా విజయానికి కారణమైన మోక్షధపై సినీ వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక రవితేజ తదుపరి సినిమాల్లో కథల ఎంపిక ఎలా ఉండబోతుందో చూడాలి.













