
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు లేవని, నిన్న జరిగిన ఘటనలే అందుకు ఉదాహరణ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలో కూర్చోనీయలేదని, 15 పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లను బయటకు పంపించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు బందిపోటు దొంగల తరహాలో ఎన్నికలు నిర్వహించారని, పులివెందుల ZPTC ఉప ఎన్నిక కోసం కుట్రలు పన్నారని జగన్ ఆరోపించారు. పోలింగ్ బూత్‌లను మార్చడం, అడ్డగోలు రాజకీయాలు చేయడం చంద్రబాబుదేనని విమర్శించారు. చంబల్ వ్యాలీలో బందిపోట్లను కూడా మరిపించే విధంగా వ్యవహరించారని, బందిపోట్ల ముఠా నాయకుడు చంద్రబాబు అని ఆయన అన్నారు.
పులివెందుల అభ్యర్థి హేమంత్‌రెడ్డిని ఇంటినుంచి బయటకు రానీయలేదని, డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో ఉప ఎన్నికలు జరిగాయని జగన్ తెలిపారు. చంద్రబాబు పాలనలో మాట వినని పోలీసు అధికారులపై కేసులు పెట్టి, సస్పెండ్ చేసి వేధించారని ఆరోపించారు. ZPTC ఉప ఎన్నిక కోసం కొంతమంది అధికారులపై కేసులు పెట్టి, పోలీసులను ఏరికోరి నియమించుకున్నారని ఆయన విమర్శించారు.









