Vijay Deverakonda: రౌడీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ‘రాణాబాలి’ క్రేజీ అప్‌డేట్!

Raanabali

Vijay Deverakonda: ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘రాణాబాలి’ (Raanabali). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతూ ముగింపు దశకు చేరుకుందని సమాచారం. ఇప్పటికే 90 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటోందట. చిన్న బ్రేక్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న తిరిగి ఈ సినిమా సెట్స్‌పైకి జాయిన్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Also Read :  Killer Movie Accident: 'కిల్లర్' షూటింగ్‌లో ఘోరం.. బిన్నీ మిల్స్ పేలుడులో ఒకరు మృతి!

ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. 18వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యంతో, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక నిర్భయమైన స్వాతంత్ర్య సమరయోధుడి కథతో ఈ పీరియాడిక్ డ్రామా రూపొందుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ భార్య ‘జయమ్మ’ అనే ఒక పవర్‌ఫుల్ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘రాణాబాలి’తో పాటు విజయ్ దేవరకొండ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా సమాంతరంగా పట్టాలెక్కించారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతోన్న రా అండ్ రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రౌడీ జనార్ధన్’. దిల్ రాజు నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. ఈ చిత్రాన్ని 2026లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది రెండు సినిమాలతో తమ అభిమాన హీరో రాబోతుండటంతో రౌడీ ఫ్యాన్స్ మస్త్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.