నన్ను ఆ బాలీవుడ్ దర్శకుడు లైంగికంగా వేధిస్తున్నాడు : తారక్ హీరోయిన్


క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సినిమా ఇండస్ట్రీలో సాధారణమైపోయింది.. ఇప్పటికే పలు అగ్ర హీరోయిన్లు సైతం క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ వచ్చారు. తాజాగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఒకప్పటి తారక్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మరెవరో కాదు. తారక్, తమన్నా నటించిన ఊసరవెల్లిలో మరో సహ నటి బెంగాల్ బ్యూటీ పాయల్ ఘోష్. హీరోయిన్‌గా విజయం సాధించలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అదృష్టం పరీక్షించుకోవాలనుకుంది. అక్కడా సక్సెస్ కాలేక సీరియల్స్ చేస్తూ స్థిరపడుతోంది. సినిమాల్లో మాత్రం సరైన అవకాశాలు పొందలేకపోయింది పాయల్ ఘోష్.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇప్పుడీమె బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధిస్తున్నాడని కేసు పెట్టింది. తాజాగా పాయల్ ఘోష్ చేసిన మరో ట్వీట్ వైరల్ అవుతోంది. దక్షిణాదిన తాను ఇద్దరు జాతీయ అవార్డులు పొందిన దర్శకులతో పనిచేశానని..తారక్‌తో చేశానని..కానీ వీళ్లంతా జెంటిల్మన్స్ అని కీర్తించింది. ఎప్పుడూ తనతో అసభ్యకరంగా ప్రవర్తించలేదని తెలిపింది. కానీ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను మూడోసారి కలిసినప్పుడే అత్యాచారం చేశాడని చెప్పింది. ఇప్పుడు చెప్పండి మీరు…దక్షిణాది సినిమా ఇండస్ట్రీని ఎందుకు పొగడకూడదు..అంటూ ప్రశ్నించింది.