Hari Hara Veera Mallu : టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్… ప్రీమియర్ షో టికెట్ రూ.600!

Hhvm Story
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతి తెలిపింది. సినిమా జులై 24న విడుదల కానుండగా, మొదటి 10 రోజులకు మాత్రమే పెంపు ధరలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 అదనపు ఛార్జీగా పెంచేందుకు అనుమతించింది. 23వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకి రూ.600 టికెట్ ధర నిర్ణయించారు. ఈ నిర్ణయం సినిమాకి మంచి ఓపెనింగ్ కలెక్షన్లను తీసుకురావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఈ అంశంలో స్వయంగా తలదూర్చకుండా, ఫిల్మ్ ఛాంబర్ ద్వారా అధికారికంగా దరఖాస్తు చేయాలని సూచించారు. ఆ దరఖాస్తు ప్రభుత్వానికి చేరుకొని, ఎ.ఎం. రత్నం సమర్పణలోని ఈ చిత్రానికి మంజూరైంది.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

క్రిష్ జాగర్లమూడి మరియు ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్ ఓ వీరోచితమైన యోధుడిగా కనిపించనున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం అందించిన ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన పాటలు, గ్లింప్స్, ట్రైలర్ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేశాయి. జులై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెంచేందుకు దరఖాస్తు చేసినా, ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయంపై స్పష్టత ఇవ్వలేదు.