Geethanjali Malli Vachindhi : స్మశానంలో టీజర్ లాంచ్.. క్రేజీ !!


అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందాల ముద్దుగుమ్మ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరియోగరాఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం.

ఇకపోతే ఈ సినిమా హీరోయిన్ అంజలికి ఎంతో ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండటమే కాదు, ఆమె కెరీర్‌ మైల్ స్టోన్ మూవీ 50వ చిత్రంగా అలరించనుంది. హారర్ కామెడీ జోనర్ చిత్రాల్లో భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన రావటమే కాదు అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఫిబ్రవరి 24 రాత్రి 7 గంటలకు బేగంపేట శ్మశానంలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. హారర్ చిత్రం కావటంతో చిత్ర యూనిట్ టీజర్ లాంచ్‌ను ఇలా ప్లాన్ చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి వేడుక జరగటం ఇదే తొలిసారి. గీతాంజలి సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయబోతున్నారు. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేేష్, షకలక శంకర్, సత్య, సునీల్, రవి శంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో మెప్పించనున్నారు. అలాగే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రాహుల్ మాధవ్‌ ఇందులో కీలక పాత్రలో నటించారు.