90’s Heroine : 12 మందితో ఎఫెర్స్.. ఈ హీరోయిన్ ఎలా అయిందో చూడండి..!

Manisha

90’s Heroine : ఒకప్పుడు 90వ దశకంలో బాలీవుడ్‌లో అగ్రనటిగా వెలుగొందిన మనీషా కొయిరాలా, తన అందం, నటనతో కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నేపాల్ మాజీ ప్రధానమంత్రి మనవరాలు, రాజకీయ నాయకుడు ప్రకాష్ కొయిరాలా కూతురైన మనీషా, రాజవంశపు వారసత్వంతోపాటు అందం, ప్రతిభ కలగలిసిన అరుదైన నటి. 1989లో నేపాలీ సినిమా ఫేరి భేతౌలాతో తెరంగేట్రం చేసిన ఆమె, సౌదాగర్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి, దాదాపు 30 సంవత్సరాల పాటు సినీ రంగంలో తన ప్రభావాన్ని చూపింది. తెలుగు, హిందీ, తమిళ సినిమాలు కలిపి 70కు పైగా చిత్రాల్లో నటించి, భారతీయుడు, ఒకే ఒకడే వంటి సూపర్ హిట్లలో తన ముద్ర వేసింది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

సినిమాల్లో అగ్రస్థానం దక్కించుకున్న మనీషా వ్యక్తిగత జీవితం మాత్రం విఫల ప్రేమకథలతో నిండిపోయింది. స్టార్ నటులు, వ్యాపారవేత్తలు, సంగీతకారులు, దౌత్యవేత్తలు ఇలా పలువురితో ఆమె పేరు జోడీగా వినిపించింది. హీరో వివేక్ ముష్రన్, నటుడు నానా పటేకర్, వ్యాపారవేత్త సెసిల్ ఆంథోని, నటుడు ఆర్యోన్ వైద్, రెస్టారెంట్ యజమాని ప్రశాంత్ చౌదరి, దౌత్యవేత్త క్రిస్పిన్ కాన్రాయ్, విప్రో వారసుడు తారిఖ్ ప్రేమ్‌జీ, హీరో అక్షయ్ కుమార్, సంగీతకారుడు సందీప్ చౌతా, అమెరికన్ ఎంట్రప్రెన్యూర్ క్రిస్టోఫర్ డోరిస్ వంటి వారితో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో అనేక వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ సంబంధాలలో ఏదీ నిలవలేదు.

తనకంటే ఏడేళ్లు చిన్నవాడైన వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌తో వివాహం చేసుకున్నప్పటికీ, ఈ వివాహ బంధం కేవలం రెండు సంవత్సరాల్లోనే ముగిసిపోయింది. ప్రస్తుతం 54 ఏళ్ల వయసులో కూడా మనీషా ఒంటరిగానే జీవిస్తోంది. కొన్నాళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడి తిరిగి బలంగా నిలిచిన ఆమె, మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

మనీషా ప్రేమకథలు ఎన్నో విన్నప్పటికీ, ఆమెకు నిజమైన ప్రేమ మాత్రం దొరకలేదు. వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలు, విఫలమైన బంధాలు ఉన్నప్పటికీ, ఆమె కెరీర్‌లో నిలిచిపోయే నటనతో ఇప్పటికీ సినీ ప్రేక్షకుల హృదయాల్లో వెలుగొందుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala)