మెగా ప్రిన్సెస్ భారసాల.. బంగారు ఊయలని గిఫ్ట్ గా ఇచ్చిన అంబానీ ?


రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగ‌తి తెలిసిందే. దాంతో తమ ఇంటికి మ‌హాల‌క్ష్మి వచ్చిందని మెగాఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మెగా ప్రిన్సెస్‌ వచ్చిందంటూ అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇకపోతే శుక్రవారం (జూన్ 30) రామ్ చరణ్, ఉపాసనల కూతురు బారసాల జరుపుకోబోతోంది. కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అంతేకాదు ఈ వేడుకకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఉపాసన తన ఇన్‌స్టాలో ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

ఇదిలా ఉండగా ఇప్పుడు మెగా ప్రిన్సెస్ కు బారసాల సందర్భంగా భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఓ బంగారు ఊయలను గిఫ్ట్ గా పంపారన్న వార్త తెగ వైరల్ అవుతోంది. ఓ ఫిల్మ్ జర్నలిస్టు సైతం తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడీ వార్త సెన్సేషన్ అవుతుంది. అంతేకాదు ఈ ఊయలను 2 కేజీలకు పైగా బంగారంతో తయారు చేయించారని.. దీని కోసం రూ.1.20 కోట్లు వరకు ఖర్చు చేశారని చెబుతున్నారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇకపోతే సంప్రదాయం ప్రకారం బారసాల కార్యక్రమం రోజే పిల్లలకు పేర్లు పెడుతుంటారు కాబట్టి ఈరోజే మెగా ప్రిన్సెస్ కి నామకరణం చేసే అవకాశం వుంది. దీంతో ఇప్పుడు ఏం పేరు పెడతారో అని మెగా అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నారు.