పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఓజి’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో అతి పెద్ద విజయం సొంతం చేసుకున్న డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఏప్రిల్ 15 నుంచి ‘ఓజీ’ చిత్రీకరణ ముంబైలో ప్రారంభం కాగా.. తాజాగా ఈ మూవీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అయితే ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ రోజు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌తో మన ముందుకు వచ్చారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

‘డాక్టర్‌’, ‘డాన్‌’, ‘గ్యాంగ్‌ లీడర్’, ‘శ్రీకారం’ వంటి చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్‌ ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటను తెరపై చూడాలని సినీ ప్రియులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసున్నారు. ఇక అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.