
418 The Film: హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం మరో కొత్త చిత్రం రెడీ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ ‘418 The Film’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ తాజా ‘A’ సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ సినిమాలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించారు. హారర్, థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త భయానక అనుభూతిని అందించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.
ఇప్పటికే సినిమా ప్రచారంలో భాగంగా రిలీజ్ చేసిన కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా “హారర్ సినిమాల్ని చూసి నవ్వింది చాలు.. ఇక భయపడే సమయం వచ్చింది” అంటూ మేకర్స్ చేస్తున్న ప్రమోషన్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తుండటంతో ‘418 The Film’పై ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం, కొత్త తరహా హారర్ ట్రీట్మెంట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా ‘418 The Film’ నిజంగానే ప్రేక్షకులను భయపెట్టగలదా? A సర్టిఫికేట్‌తో వస్తున్న ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి అనుభూతిని అందించబోతుందో చూడాలి. సెప్టెంబర్ 18న అసలు ఎలా భయపెడతారో చూద్దాం.














