Director Prashanth Neel: ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో టాప్ ట్రెండింగ్‌లో ప్రశాంత్ నీల్.. రీజన్ ఇదే!

Prashanth Neel

Director Prashanth Neel: ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగిపోతోంది. ఇటు ఎక్స్ (ట్విట్టర్), అటు ఇన్‌స్టాగ్రామ్‌లలో టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తూ నెటిజన్లకు పూనకాలు తెప్పిస్తున్నారు ఆ దర్శకుడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టిన మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ రోజు (జూన్ 4) ఆయన పుట్టినరోజు కావడంతో, సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

ట్విట్టర్‌ను షేక్ చేస్తున్న బర్త్‌డే ట్రెండ్స్
సాధారణంగా హీరోల బర్త్‌డేలకే సోషల్ మీడియాలో రచ్చ చూస్తుంటాం. కానీ ఒక దర్శకుడి పుట్టినరోజుకు కూడా ఈ రేంజ్ ట్రెండ్స్ సెట్ అవ్వడం ఒక్క ప్రశాంత్ నీల్‌కే సాధ్యమైందని అంటున్నారు. ‘KGF’ సిరీస్, ‘సలార్’ చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఊరమాస్ ఎలివేషన్స్ అంటే ఎలా ఉంటాయో చూపించిన ఈ మాస్ డైరెక్టర్‌కు ఈ రోజు ఉదయం నుంచే విషెస్ చెబుతూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా #HappyBirthdayPrashanthNeel, #HBDPrashanthNeel వంటి హాష్‌ట్యాగ్‌లు టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.

Also Read :  Peddi Pre-Sales: బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ఊచకోత.. రిలీజ్‌కు ముందే రూ. 22 కోట్ల కలెక్షన్లు!

ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ‘సలార్-2’ (Salaar 2) కోసం ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్, అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ #NTRNeel (Dragon) కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. నీల్ మేకింగ్ స్టైల్‌ను ఎలివేట్ చేస్తూ ఫ్యాన్స్ డిజైన్ చేసిన స్పెషల్ పోస్టర్స్, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన ప్రతిభ మీద ఉన్న అచంచలమైన నమ్మకం, వెండితెరపై డార్క్ థీమ్‌తో మ్యాజిక్ చేయగల కళా నైపుణ్యమే ప్రశాంత్ నీల్‌ను ఈ స్థాయికి చేర్చాయని సినీ వర్గాలు అంటున్నాయి. కమర్షియల్ సినిమాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన ఆయన మేకింగ్ స్టైల్‌కు ఇండస్ట్రీ వర్గాలు సైతం సలాం కొడుతున్నాయి. పలువురు టాలీవుడ్, శాండల్‌వుడ్ ప్రముఖులు ప్రశాంత్ నీల్‌కు ప్రత్యేకంగా బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.