Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Lenin akhil

Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ (Lenin). ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు సినిమా ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ తాజాగా ఒక అదిరిపోయే క్రేజీ అప్‌డేట్ అందించింది. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను జూన్ 30న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ ట్రైలర్‌ను కేవలం సోషల్ మీడియాలో వదలడమే కాకుండా, ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించి అత్యంత గ్రాండ్‌గా లాంచ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.

Also Read :  Nandini Reddy: షూటింగ్ టైమ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. అసలు నిజం బయటపెట్టిన డైరెక్టర్ నందినీ రెడ్డి!

అఖిల్ సరికొత్త మేకోవర్, పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ ట్రైలర్ నెట్ ఇంట్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుందని చెబుతున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఫైనల్ గా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, స్టార్ కంపోజర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 30న రాబోయే ఈ ట్రైలర్ లాంచ్‌తో సినిమా ప్రమోషన్స్ స్పీడును మరింత పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో అక్కినేని అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.