Alcohol : అల్లరి నరేష్ కెరీర్‌లో కొత్త మలుపు – ఆకట్టుకుంటున్న ‘ఆల్కహాల్’ టీజర్

Alcohol
Alcohol : చాలా రోజుల తరువాత అల్లరి నరేష్ నుండి ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరు ‘ఆల్కహాల్’. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మాతలు నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’ తో ప్రేక్షకుల మన్ననలను పొందిన దర్శకుడు మెహర్ తేజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

మద్యం ఒక మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, తాగడానికి ముందు మరియు తరువాత అతని ప్రవర్తనలో వచ్చే మార్పులు, వాటి చుట్టూ జరిగే సంఘటనలు ఈ టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. హాస్యంతో పాటు నవరసాలను అద్భుతంగా పలికించగల నటుడిగా పేరుగాంచిన అల్లరి నరేష్, ఈసారి పూర్తిగా కొత్త అవతారంలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నారు. ఆయనతో పాటు సత్య కలయిక వినూత్నమైన హాస్యాన్ని తెచ్చిపెట్టనుందని టీజర్‌ సూచిస్తోంది. వీరిద్దరి మధ్య కామెడీ సీన్స్ చూస్తుంటే చాలాకాలం తరువాత అల్లరి నరేష్ ఖాతాలో మరో హిట్టు పడే అవకాశాలున్నట్టు కనిపిస్తున్నాయి. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రుహాణీ శర్మ, నిహారిక NM, హర్షవర్ధన్, గిరీష్ కులకర్ణి, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్ మరియు రఘుబాబులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జనవరి 1, 2026న నూతన సంవత్సరం కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం, అల్లరి నరేష్ కెరీర్‌లో ఓ మలుపు కానుందనే భావన కలిగిస్తోంది.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం