Balakrishna : ముంబై స్టాక్ ఎక్స్చేంజ్‌లో బాలకృష్ణ రికార్డు

Balakrishna
Balakrishna : ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌ (NSE) లో ఘంట మోగించిన తొలి దక్షిణ భారతీయ నటుడిగా ఆయన చరిత్రలో నిలిచారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో కలిసి బాలకృష్ణ NSEని సందర్శించారు. ఈ సందర్భంగా NSE అధికారులు ఆయనకు ఘంట మోగించే ప్రత్యేక అవకాశాన్ని కల్పించారు.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

బాలకృష్ణ గారికి దక్కిన ఈ గౌరవం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తించింది. సినీ రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించడమే కాకుండా, సేవా కార్యక్రమాలు, ప్రజా ప్రతినిధిగా ప్రజల కోసం పనిచేస్తూ వచ్చిన బాలకృష్ణ, ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలోనూ ఒక ప్రతీకాత్మక గుర్తింపును సొంతం చేసుకున్నారు.