China Piece : ‘చైనా పీస్’ నుంచి ‘ఇదేంటో జేమ్స్ బాండ్’ సాంగ్ రిలీజ్..

China piece
China Piece : నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’ సినీ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూనిక్ కాన్సెప్ట్‌, యాక్షన్‌, థ్రిల్‌, హ్యూమర్‌ ఎలిమెంట్స్‌తో కూడిన టీజర్‌ ఇప్పటికే మంచి బజ్‌ను సృష్టించి సినిమా పై అంచనాలను పెంచింది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

తాజాగా మేకర్స్ ‘ఇదేంటో జేమ్స్ బాండ్’ అనే పాటను విడుదల చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ ఎనర్జిటిక్ కంపోజిషన్‌తో ఈ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. స్ఫూర్తి జితేందర్‌, హారిక నారాయణ్ వోకల్స్‌, దినేష్ కాకర్ల ఫన్‌ఫుల్ లిరిక్స్‌ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సురేష్ రగుతు కెమరామ్యాన్‌గా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..