Dhurandhar : గల్ఫ్‌లో బ్యాన్… ఇండియాలో దుమ్మురేపుతున్న ధురంధర్!

Dhurandhar
అదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ డ్రామా ధురంధర్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రీతిలో కలెక్షన్లు రాబడుతోంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సినిమా అద్భుతమైన రన్‌ను కొనసాగిస్తోంది. అయితే ఇదే సమయంలో చిత్రాన్ని పలు గల్ఫ్ దేశాలు బ్యాన్ చేయడం పెద్ద చర్చగా మారింది. ముస్లింలను నెగటివ్‌గా చూపించే హిందీ సినిమాలు గల్ఫ్ ప్రాంతాల్లో తరచూ నిషేధానికి గురవుతాయి. గతంలో “ఫైటర్”, “టైగర్ 3” లాంటి చిత్రాలు ఇదే కారణంతో అక్కడ విడుదల కాకపోవడం తెలిసిందే. ఇప్పుడు ధురంధర్ కూడా బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, UAE దేశాల్లో పూర్తిగా నిషేధితమైంది.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

సినిమా టీమ్ ప్రకటించిన ప్రకారం, మొదటి వారం లోపే 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ధురంధర్, గల్ఫ్ మార్కెట్ కోల్పోయినా దేశీయంగా బలమైన వసూళ్లను సాధిస్తోంది. బాలీవుడ్ సినిమాల‌కు గల్ఫ్ దేశాలు కీలక మార్కెట్ అయినప్పటికీ, అద్భుతమైన పాజిటివ్ రివ్యూలు మరియు ప్రేక్షకుల నుండి వస్తున్న మంచి స్పందనతో సినిమా థియేటర్లలో దీర్ఘంగా రన్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.