HHVM : హరి హర వీర మల్లు ట్రైలర్ హైప్.. పార్ట్ 2పై నిధి అగర్వాల్ క్లారిటీ..!

Hhvm

HHVM : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీర మల్లు సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. గత కొంతకాలంగా ఈ చిత్ర ట్రైలర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న ఈ ట్రైలర్‌ ద్వారా సినిమా ప్రమోషన్‌కు గట్టి బూస్ట్ లభించింది. సినిమాను జూలై 24, 2025న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించి రెండో భాగంపై కూడా చర్చ కొనసాగుతోంది. హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటీవల ఈ విషయమై కొన్ని వివరాలను వెల్లడించారు. సినిమా మొదటి భాగాన్ని Sword vs Spirit అనే టైటిల్‌తో చిత్రీకరించారని, రెండో భాగం చిత్రీకరణ ఇంకా మొదలుకాలేదని ఆమె చెప్పారు. ఇప్పటివరకు కేవలం 20 నిమిషాల వరకూ మాత్రమే రెండో భాగం చిత్రీకరించారని, మిగిలినది ఇంకా పూర్తయ్యాల్సి ఉందని వివరించారు. మొదటి భాగం ఫలితాన్ని పక్కనపెట్టి, పవన్ కళ్యాణ్ రెండో భాగానికి డేట్స్ కేటాయిస్తారో లేదో చూడాలి.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ మళ్లీ పూర్తిస్థాయి యాక్షన్ అవతారంలో కనిపించనున్నారు. చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. సినిమాటోగ్రఫీ విభాగంలో జ్ఞానశేఖర్ , మనోజ్ పరమహంస అద్భుతమైన విజువల్స్‌ను అందించారని ట్రైలర్‌ను చూసినవారు అంటున్నారు.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

ఇక బాబీ డియోల్ ఈ చిత్రంలో ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, తానికెళ్ళ భరణి, నాజర్, సత్యరాజ్, దిలీప్ తాహిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో, హరిహర వీర మల్లు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.