
Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నేడు (జూన్ 4, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ చిత్రం విడుదలవుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని.. ఇందులో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల కొండను జాన్వీ కాలినడకన ఎక్కి స్వామి వారిని దర్శించుకున్నారు. తన కెరీర్‌లో ఎలాంటి ముఖ్యమైన ఘట్టం ఉన్నా, కొత్త సినిమా రిలీజ్ అవుతున్నా తిరుమల కొండకు రావడం జాన్వీకి మొదటి నుంచి ఉన్న అలవాటు. ఈ సారి కూడా ‘పెద్ది’ సినిమా భారీ విజయం సాధించాలంటూ ఆమె శ్రీవారికి ప్రత్యేక ప్రార్థనాలు చేశారు.
1980ల నాటి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్ కీలకమైన పల్లెటూరి యువతి పాత్రలో అలరించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, కన్నడ లెజెండ్ శివరాజ్ కుమార్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైన ఈ చిత్రం.. విడుదలకు ముందే రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్‌తో (ప్రీ-సేల్స్) ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర గట్టి హైప్‌ను క్రియేట్ చేసింది. నేడు (జూన్ 4) సినిమా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేసిన నేపథ్యంలో, జాన్వీ కపూర్ భక్తిని, సినిమా పట్ల ఆమెకున్న నిబద్ధతను అభినందిస్తూ మెగా అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘అచ్చియమ్మ’గా టాలీవుడ్‌లో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని జాన్వీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
From seeking Lord Balaji's blessings at Tirumala 🙏✨
To witnessing the love for #Peddi 💜
Forever grateful 🙏🤍#JanhviKapoor #PEDDI pic.twitter.com/j8o7iy5HNQ
— Jahnavi Kapoor (@JanhvikapoorFC_) June 4, 2026








