
Mega 158 Update: మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ‘Mega158’ ప్రాజెక్ట్ శరవేగంగా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల సునామీ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అంతకు మించిన పవర్‌ఫుల్ కంటెంట్‌తో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోల్లాచి షెడ్యూల్‌ను చిత్ర బృందం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఈ హై-ఎనర్జీ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కొన్ని అత్యంత కీలకమైన సన్నివేశాలను డైరెక్టర్ బాబీ షూట్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. పోల్లాచి షెడ్యూల్ కంప్లీట్ కావడంతో చిత్ర యూనిట్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తదుపరి షెడ్యూల్‌కు రెడీ అయిపోతోంది.
నెక్స్ట్ షెడ్యూల్ చాలా త్వరలోనే స్టార్ట్ కానుందని, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఒక ‘బ్లడీ బెంచ్‌మార్క్’ సెట్ చేయబోతున్నామని టీమ్ ధీమా వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని క్రేజీ అప్‌డేట్స్‌ను అతి త్వరలోనే పంచుకోనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ బ్యూటీస్ అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా పోల్లాచి షెడ్యూల్ ప్యాకప్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
An electrifying schedule of #Mega158 has been successfully completed in Pollachi, some spectacular moments that are shaping up beautifully. ❤️🔥
More exciting updates on the way… ⏳#ChiruBobby2
Produced by #VenkatKNarayana @KvnProductionsMegastar @KChiruTweets#AnaswaraRajan… pic.twitter.com/jIWDTjEvxn
— Bobby (@dirbobby) June 11, 2026














