
తెలుగు సినీ చరిత్రలో ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో సంచలనం సృష్టించడం ‘కలర్ ఫోటో’ తర్వాత మళ్లీ ‘జిగ్రిస్’ తోనే సాధ్యమైంది. హీరో కృష్ణ బురుగుల ఈ సినిమాతో సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అయ్యారు. సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నా, ఓటీటీలో మాత్రం ‘జిగ్రిస్’ తన హవాను కొనసాగిస్తోంది. రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో ట్రెండ్ అవుతూ ఈ చిత్రం అరుదైన రికార్డు నెలకొల్పింది. ఒక్క తెలుగు భాషలోనే అందుబాటులో ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు.
సినిమాలో కార్తీక్ పాత్రలో కృష్ణ బురుగుల నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. “క్యారెక్టర్‌లో పూర్తిగా జీవించేశావు” అంటూ ఫ్యాన్స్ మెసేజ్‌లతో ఆయనను ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. యువత ఆయనను కొత్త “ఓటీటీ స్టార్”గా కీర్తిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘జిగ్రిస్’ క్లిప్స్, కృష్ణ నటనపై ప్రశంసలే కనిపిస్తున్నాయి. ‘కలర్ ఫోటో’ తర్వాత ఓటీటీలో ఇంతటి సంచలనం సృష్టించిన నటుడిగా కృష్ణ బురుగుల పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. నిజంగా ‘జిగ్రిస్’ ఆయనను ఒక అన్‌స్టాపబుల్ ఓటీటీ స్టార్‌గా నిలబెట్టింది.









