
Kayadu Lohar: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్లో హీరోయిన్ కాయదు లోహర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వేదికపై తెలుగులో మాట్లాడుతూ అలరించిన ఆమె, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వర్కింగ్ స్టైల్‌పై చేసిన బోల్డ్ కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గురించి కాయదు మాట్లాడుతూ.. “శ్రీకాంత్ సర్ ఒక క్రేజీ, క్రాక్ డైరెక్టర్. ఆయనకు సినిమా అంటే ఒక పిచ్చి. ఆయనలాంటి దర్శకుడితో పనిచేయడం చాలా అంటే చాలా కష్టం. కానీ ఆ కష్టం మొత్తం సినిమా కోసమే, సినిమాపై ఆయనకున్న అంకితభావం, ప్యాషన్ అలాంటివి. తెరపై ఆ మ్యాజిక్‌ను ప్రేక్షకులు కచ్చితంగా ఫీల్ అవుతారు” అంటూ దర్శకుడి డెడికేషన్‌ను కొనియాడారు. ప్రస్తుతం శ్రీకాంత్ చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈవెంట్‌కు రాలేకపోయారని ఆమె తెలిపారు.
నానితో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై కాయదు మాట్లాడుతూ ఫ్యాన్స్‌లో హైప్‌ను మరింత పెంచారు. “సినిమాలో నాని సర్ ఏం చేశారో చూడటానికి ఆడియన్స్ ఇంకా సిద్ధంగా లేరనే చెప్పాలి. ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం చిన్న గ్లింప్స్ మాత్రమే. సినిమాలో ఆయన విశ్వరూపం చూస్తారు. సెప్టెంబర్ 24 నుంచి ‘జడల్ జమానా’ మొదలవుతుంది. జడల్, సుబ్బు పాత్రలను ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారు” అని ధీమా వ్యక్తం చేశారు. షూటింగ్ అంతటా నాని తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగులో “అందరికీ నమస్కారం.. ఎట్లా ఉన్నారు? ఏం జనాల్రో బాబు.. మీ ఎనర్జీ అదిరిపోయింది” అంటూ ముద్దుముద్దు మాటలతో స్పీచ్ మొదలుపెట్టిన కాయదు, టాలీవుడ్ ప్రేక్షకులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇతర భాషల నుంచి వచ్చే నటీనటులను కూడా తెలుగు ప్రేక్షకులు సొంత మనుషుల్లా ఆదరిస్తారని, ‘ది ప్యారడైజ్’లో తాను పోషించిన ‘సుబ్బు’ పాత్రకు కూడా అదే స్థాయి ప్రేమను అందించాలని కోరారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చారని, డీవోపీ సాయి విజువల్స్ అద్భుతంగా తీశారని చెప్పిన కాయదు.. నిర్మాత సుధాకర్ చెరుకూరి, నటులు సంపత్, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొత్తంగా చూస్తే, కాయదు లోహర్ స్పీచ్‌తో ‘ది ప్యారడైజ్’పై హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది.













