
Keerthy Suresh: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తన బిజీ వర్క్ షెడ్యూల్ గురించి చేసిన తాజా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుసగా 20 గంటల పాటు షూటింగ్‌లో పాల్గొనడంతో పాటు, మొత్తం 41 గంటలు నిద్రపోకుండా పని చేసినట్లు ఆమె వెల్లడించారు. అయినప్పటికీ, ఇలాంటి బిజీ జీవితాన్ని తాను భారంగా కాకుండా ఓ వరంగా భావిస్తానని చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేసిన కీర్తి.. దాదాపు 24 గంటల తర్వాత తన గదికి చేరుకున్నానని తెలిపింది. “నిన్న ఉదయం 6 గంటలకు షూటింగ్ కోసం బయలుదేరాను. ఇప్పుడు మళ్లీ ఉదయం 6 గంటలు అయ్యింది. సుమారు 20 గంటలు నిరంతరం పనిచేశాను. మరో గంటలోనే తర్వాతి షూట్‌కు వెళ్లాలి. అయినా ఇవి మంచి సమస్యలే. ఇదే నా జీవితం.. దీన్ని నేను ఒక వరంగా భావిస్తాను” అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది.
మరో పోస్టులో.. “ఈ పోస్ట్ పెట్టేంత శక్తి కూడా నిన్న నాకు లేదు. ఒక షూట్ నుంచి మరో షూట్‌కు పరుగులు పెట్టాను. మొత్తం 41 గంటలు నిద్రపోకుండా మెలకువగానే ఉన్నాను” అంటూ తన అలసటను అభిమానులతో పంచుకుంది. అయితే కేవలం గంట విరామం దొరికినా, మళ్లీ షూటింగ్‌కు వెళ్లే ముందు మిర్రర్ సెల్ఫీ తీసుకునేంత ఉత్సాహం మాత్రం ఉందంటూ సరదాగా పేర్కొంది. అనంతరం మరో షూట్‌కు బయలుదేరుతున్న వీడియోను షేర్ చేసిన కీర్తి.. “I Will Survive” అని రాసి ఉన్న టీ-షర్ట్‌ను చూపిస్తూ, “ఈ రోజు ఈ టీ-షర్ట్‌కు నిజంగా ఒక అర్థం ఉంది… అవును, నేను నిలబడతాను” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘సత్యవాన్ సావిత్రి’, ‘రఫ్తార్’, ‘అక్క’, ‘రౌడీ జనార్ధన’ వెంకీ–అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు.














