
#VenkyAnil5: విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ #VenkyAnil5. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న చిత్రబృందం.. తాజాగా ఓ హై ఎనర్జీ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉందట. ఈ పాట కోసం గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా కోసం నిర్మించిన ప్రత్యేక హౌస్ సెట్‌ను వినియోగిస్తున్నారట. ఈ సాంగ్ షూట్లో వెంకటేశ్, కల్యాణ్ రామ్‌తో పాటు కీర్తి సురేశ్, కృతి శెట్టి పాల్గొంటున్నట్లు సమాచారం. సినిమాలో ఈ పాట కీలకంగా ఉండటంతో పాటు లీడ్ క్యారెక్టర్ల మధ్య అదిరిపోయే ఎనర్జీని చూపించనున్నట్లు తెలుస్తోంది.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేశ్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో అనిల్ రావిపూడి మార్క్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తొంది. వెంకటేశ్–అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇది ఐదో చిత్రం కావడంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి విజయాల తర్వాత ఈ కాంబో నుంచి వస్తున్న కొత్త మల్టీస్టారర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సాంగ్‌కి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మేకర్స్ నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














