
Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం బడ్జెట్ పరంగానే కాకుండా, బిజినెస్ పరంగానూ ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ (టెలివిజన్), డిజిటల్ (ఓటీటీ), థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకునేందుకు ప్రముఖ వినోద సంస్థ ‘జీ’ (ZEE Network) గట్టి ప్రయత్నాలు చేస్తోందట. ఇండియా వ్యాప్తంగా అన్ని భాషలకు సంబంధించిన హక్కుల కోసం జీ గ్రూప్ ఇప్పటికే సంప్రదింపులు (Discussions) స్టార్ట్ చేసినట్లు సమాచారం.
సాధారణంగా పెద్ద సినిమాలకు డిజిటల్ ఒకరికి, శాటిలైట్ హక్కులు మరొకరికి అమ్ముడుపోతుంటాయి. కానీ, ‘వారణాసి’ క్రేజ్ దృష్ట్యా థియేటర్ హక్కులతో పాటు మిగతా అన్ని రైట్స్‌ను ఒకే ప్యాకేజీగా (All-in-One Deal) దక్కించుకోవాలని జీ సంస్థ భారీ ఆఫర్‌తో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ డీల్ గనుక ఓకే అయితే, ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఇది అత్యంత భారీ – చారిత్రాత్మక డీల్‌గా నిలవడం ఖాయం అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కుల రేసులో పలు అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పోటీ పడుతున్న తరుణంలో, జీ సంస్థ ఈ చర్చలను ఎంతవరకు సక్సెస్ చేస్తుందో చూడాలి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














