Nani: నితిన్‌పై నాని ఆసక్తికర కామెంట్స్.. ‘జయం’, ‘ఇష్క్’ మ్యాజిక్‌ను గుర్తు చేసేలా ‘అలియాస్ రుక్మిణి’!

Nani

Nani: హీరో నితిన్ ప్రధాన పాత్రలో కొత్త చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తుండగా, న్యాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నారు. తాజాగా జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపిన నాని.. ఈ సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. “నితిన్ తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అయితే నితిన్ నా సినీ కెరీర్ మొదలవ్వక ముందే నితిన్ నన్ను చూస్తున్నారు. నేను ఆయన నటుడిగా చేసిన ప్రయాణాన్ని చాలా దగ్గరగా గమనించాను” అని అన్నారు.

అలాగే ఈ సినిమా నితిన్ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. “‘జయం’, ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ లాంటి అద్భుతమైన సినిమా లాంటి ఒక లవ్ స్టోరీని మళ్లీ ప్రేక్షకులకు అందబోతోంది అని ధీమా వ్యక్తం చేశారు. ‘అలియాస్ రుక్మిణి’ విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని నాని వెల్లడించారు. నితిన్–మురళీకాంత్ దేవసోత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది.