
Mithra Mandali : ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా విజయేందర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. సప్తాస్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రాన్ని బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేయగా, ఐఎండీబీ లో ట్రెండింగ్‌లోకి రావడం సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది. దీంతో సినిమా విడుదలకు ముందు, అక్టోబర్ 15న ప్రత్యేక ప్రీమియర్లతో ఆడియన్స్ ముందుకు రాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.
తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యులు సినిమాని వీక్షించి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అభినందించారు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం తో పాటు విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా బ్రహ్మానందం ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారు. కుటుంబమంతా కలిసి చూసే సరదా సినిమా కావడంతో, అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, ఒక రోజు ముందే ప్రేమియర్ షోలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.










