
Vrusshabha : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వృషభ’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో మోహన్ లాల్ సరికొత్తగా కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకోగా, ఆంటోనీ సామ్సన్ కెమెరా వర్క్, సామ్ సిఎస్ సంగీతం, ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ సినిమాకి కొత్త రేంజ్ ఇచ్చాయి.
ఈ సందర్భంగా దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ.. “‘వృషభ’ కేవలం సినిమా కాదు, ఇది మాకు ఒక ఎమోషనల్ జర్నీ. లెజెండరీ మోహన్ లాల్‌తో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన నటన ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌గా కనిపించింది. సమర్జిత్ చేసిన కొడుకు పాత్ర కూడా బలంగా నిలుస్తుంది. తండ్రి, కొడుకుల బంధం చుట్టూ తిరిగే ఈ శక్తివంతమైన కథ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది” అన్నారు. మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.










