Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ లో ఊహించని ట్విస్ట్.. ఏకంగా 20 నిమిషాల మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్!

AK47

Aadarsha Kutumbam: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలింనగర్ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఒక భారీ ‘ట్రైన్ ఎపిసోడ్’ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవనుందని టాక్. దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఈ కీలకమైన సీక్వెన్స్ కోసం మేకర్స్ ఎలాంటి రాజీ పడకుండా భారీగా ఖర్చు చేశారంటా. దీని కోసం ఒక భారీ ట్రైన్, రైల్వే స్టేషన్ సెట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ సెట్‌లోనే అత్యంత కీలకమైన డ్రామా, యాక్షన్, వినోదభరితమైన సన్నివేశాలను చిత్రీకరించారట.

Also Read :  Ramayana: హాలీవుడ్ వేదికగా ‘రామాయణ’ విజువల్ వండర్.. లాస్ ఏంజెల్స్‌లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్!

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్ తన పాత మార్క్ సిట్యుయేషనల్ కామెడీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ఫోర్స్డ్‌గా కాకుండా, కథ, పాత్రల ప్రయాణంలో భాగంగానే హాస్యం ఎంతో సహజంగా సాగిపోయేలా డైలాగ్స్ అండ్ స్క్రీన్‌ప్లేను లాక్ చేశారట. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘అత్తారింటికి దారేది’ తరహాలో క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ హిలేరియస్ వినోదాన్ని ఈ ట్రైన్ ఎపిసోడ్‌లో ప్రేక్షకులు చూడబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. విక్టరీ వెంకటేష్ – శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రివిక్రమ్ వింటేజ్ కామెడీ టైమింగ్‌తో రాబోతున్న ఈ ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.