Ram Charan: సుకుమార్ తర్వాత మళ్లీ బుచ్చిబాబుతోనే.. #RC18 క్రేజీ అప్‌డేట్!

Ram Charan

Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుల బ్లాక్‌బస్టర్ జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనానికి సిద్ధమవుతోంది. ఇటీవల వీరిద్దరి కలయికలో విడుదలైన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ సక్సెస్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరెక్టర్ బుచ్చిబాబు మేకింగ్ స్టైల్‌కు, ఆయన స్టోరీకి ఫిదా అయిన రామ్ చరణ్.. ఆయనతో మరో క్రేజీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు మెగా పవర్‌స్టార్ అప్పుడే బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్ కూడా మొదలుపెట్టేశారట. ఈ క్రమంలోనే రామ్ చరణ్ టాలీవుడ్‌కు చెందిన ఒక టాప్ ప్రొడ్యూసర్‌కు స్వయంగా కీలక సూచన చేసినట్లు సమాచారం.

Also Read :  Actor Akhil Raj: 'అమ్మను తిడితే ఏ కొడుకైనా ఊరుకుంటాడా?' డెలివరీ బాయ్ వివాదంపై నోరు విప్పిన హీరో అఖిల్ రాజ్..

బుచ్చిబాబుతో మరో సినిమా లాక్ చేద్దామని, ఇప్పుడే ఆయనకు ఒక భారీ అడ్వాన్స్ ఇచ్చి డేట్స్‌ను రిజర్వ్ చేయాల్సిందిగా కోరారట. హీరో స్వయంగా రంగంలోకి దిగడంతో ఆ అగ్ర నిర్మాత కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా, డైరెక్టర్ బుచ్చిబాబుకు భారీ స్థాయిలో అడ్వాన్స్ అమౌంట్‌ను అందజేసినట్లు టాక్. బుచ్చిబాబు కూడా ఈ మొత్తాన్ని అందుకోవడంతో ఈ క్రేజీ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మెగా పవర్‌స్టార్ తన 17వ చిత్రాన్ని (#RC17) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు.