Samantha: ‘నా సిక్స్ ప్యాక్ ఇదే’.. బేబీ బంప్ ఫోటో షేర్ చేస్తూ సమంత క్రేజీ క్యాప్షన్!

Samantha

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె తన ప్రెగ్నెన్సీ వార్తను అధికారికంగా ప్రకటిస్తూ అభిమానులకు తీపి కబురు అందించారు. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సమంత తన బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తున్న ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది. అయితే, దానికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Also Read :  Nandini Reddy: షూటింగ్ టైమ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. అసలు నిజం బయటపెట్టిన డైరెక్టర్ నందినీ రెడ్డి!

ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సమంత.. గతంలో తనకు ఉన్న అబ్స్ (Abs)ను ఫన్నీగా గుర్తు చేసుకుంటూ.. “నా సిక్స్ ప్యాక్ ఇదే.. నిన్ను ఎప్పుడు చూడాలో అప్పుడే చూస్తాను” (My six-pack. I’ll see you when I see you) అంటూ తన పుట్టబోయే బిడ్డను ఉద్దేశించి చాలా సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. తన భర్త, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (రాజ్ అండ్ డీకే ఫేమ్)తో కలిసి తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నట్లు సమంత ఇటీవలే ప్రకటించింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత సమంత షేర్ చేసిన మొదటి బేబీ బంప్ ఫోటో ఇదే కావడంతో.. అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఈ పోస్ట్‌పై లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమంత ముఖంలో ప్రెగ్నెన్సీ గ్లో స్పష్టంగా కనిపిస్తోందంటూ నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.