Mybaby DNA : 350 థియేటర్లలో గ్రాండ్ విడుదల..తమిళ హిట్ మూవీ ‘డీఎన్‌ఏ’ తెలుగులో ‘మై బేబి’గా రిలీజ్‌కు సిద్ధం

My baby

Mybaby DNA : తమిళంలో ఘన విజయం సాధించిన ‘డీఎన్‌ఏ’ సినిమా ఇప్పుడు తెలుగులో ‘మై బేబి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని జూలై 18న విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా పంపిణీ హక్కులు హాట్‌కేక్‌లా అమ్ముడవడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.

నిమిషా సజయన్, అథర్వ మురళి కీలక పాత్రల్లో నటించిన ఈ ఎమోషనల్ డ్రామాకు నెల్సన్ వెంకట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి ఎస్‌కె పిక్చర్స్ బ్యానర్‌పై తెలుగులో ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘పిజ్జా’ వంటి విజయవంతమైన అనువాద చిత్రాలతో పేరుగాంచిన సురేష్ కొండేటి మరో హిట్ కోసం సిద్ధమయ్యారు. సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది.

Also Read :  జగపతి బాబు 'వదలా' ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్...

తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ హాట్‌ కేక్‌లా అమ్ముడయ్యాయి. నైజాంలో గ్లోబల్ సినిమాస్-ఏషియన్ సునీల్, వైజాగ్‌లో గాయత్రిదేవి ఫిలిమ్స్-సతీష్, ఈస్ట్ గోదావరిలో ఆదిత్య సినిమాస్-హెచ్. నాగి సత్యనారాయణ, వెస్ట్ గోదావరిలో వెంకటేశ్వర ఫిలిమ్స్-కృష్ణారెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్-శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర ఫిలిమ్స్-కృష్ణారెడ్డి, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో గురు రాఘవేంద్ర ఫిలిమ్స్-శోభన్, చిత్తూరు, కడప జిల్లాల్లో ధనలక్ష్మి ఫిలిమ్స్-డి. సుభాష్ చంద్ర నాయుడు పంపిణీ హక్కులు తీసుకున్నారు.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

గిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి విశ్లేషకుల నుంచి ఇప్పటికే మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆధునిక జీవనశైలిలోని భావోద్వేగాలను, సంబంధాలను ఆవిష్కరించే విధంగా ఈ సినిమా రూపొందింది. తమిళంలో హృదయాలను గెలుచుకున్న ఈ సినిమా, తెలుగులో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత సురేష్ కొండేటి ఆశాభావం వ్యక్తం చేశారు.